మహిళా సభ అధ్యక్షురాలిగా మణిమాలారావు

ABN , First Publish Date - 2021-07-24T14:22:06+05:30 IST

తమిళనాడు ఆర్యవైశ్య మహిళా సభ మద్రాసు యూనిట్‌ 2021-23వ నూతన కార్యవర్గ కమిటీ అధ్యక్షురాలిగా మణిమాలా రావు పొన్నూరి నియమితులయ్యారు. ఆళ్వార్‌పేటలోని ఎ

మహిళా సభ అధ్యక్షురాలిగా మణిమాలారావు

ప్యారీస్‌(చెన్నై): తమిళనాడు ఆర్యవైశ్య మహిళా సభ మద్రాసు యూనిట్‌ 2021-23వ నూతన కార్యవర్గ కమిటీ అధ్యక్షురాలిగా మణిమాలా రావు పొన్నూరి నియమితులయ్యారు. ఆళ్వార్‌పేటలోని ఎతిరాజ్‌ కల్యాణ మండపంలో గురువారం సాయంత్రం మహిళా సభ సర్వసభ్య సమావేశం సభ మాజీ అధ్యక్షురాలు లయన్‌ సుజాత నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశం 2021-23 సంవత్సరాలకుగాను నూతన కార్యవర్గ కమిటీని ఎన్నుకుంది. అధ్యక్షురాలిగా మణిమాలారావు పొన్నూరి, గౌరవ కార్యదర్శిగా సి.శైలశ్రీ రాజేష్‌, గౌరవ కోశాధికారిగా ఎస్‌.చిత్రలేఖ, భార్గవి, వసుంధరలను సుజాత పరిచయం చేశారు. నూతన కార్యవర్గ కమిటీ తరఫున చేపట్టనున్న ప్రాజెక్టుల వివరాలను మణిమాలరావు సభకు వివరించారు. తొలి ప్రాజెక్ట్‌ ‘గో గ్రీన్‌’ పేరుతో మొక్కలు పంపిణీచేయడంతో పాటు పేద కుటుంబానికి చెందిన టీకే హేమప్రియకు ఫస్టియర్‌ కళాశాల ఫీజు కోసం రూ.30 వేలు అందజేశారు. ఈ నెల 30వ తేది ఉదయం 9 గంటలకు తిరువళ్లూర్‌ జిల్లా పెరియపాళయం సమీపంలో ఉన్న విద్యారంభ జ్ఞాన మహాసరస్వతి ఆలయంలో సరస్వతి పూజను లోకకల్యాణార్ధం నిర్వహించనున్నట్లు మణిమాలారావు ప్రకటించారు.

Updated Date - 2021-07-24T14:22:06+05:30 IST