మ‌హారాష్ట్ర‌లో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు

ABN , First Publish Date - 2021-06-22T11:21:06+05:30 IST

దేశంలో క‌రోనా వైర‌స్ సెకెండ్ వేవ్‌లో...

మ‌హారాష్ట్ర‌లో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు

ముంబై: దేశంలో క‌రోనా వైర‌స్ సెకెండ్ వేవ్‌లో కేసుల త‌గ్గుద‌ల క‌నిపిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో పది వేలకు తక్కువగా  క‌రోనా కేసులు  న‌మోదు కావ‌డం, వంద‌కు దిగువ‌గా మ‌ర‌ణాలు సంభ‌వించ‌డం జ‌రిగింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ అందించిన గ‌ణాంకాల ప్ర‌కారం మహారాష్ట్రలో గ‌డ‌చిన 24 గంటల్లో కొత్త‌గా 6,270 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. 13,758 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇదే స‌మ‌యంలో క‌రోనాతో బాధపడుతూ 94 మంది మృతిచెందారు. 


రాష్ట్రంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య ప్రస్తుతం 1,24,398గా ఉంద‌ని ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా కరోనాతో ఇప్ప‌టివ‌రకూ రాష్ట్రంలో 1,18,313 మంది క‌న్నుమూశారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ 3,95,14,858 కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, వీటిలో 59,72,781 నమూనాలు పాజిటివ్‌గా తేలాయి. ఇదిలావుండ‌గా ముంబైలో కరోనా నుంచి కోలుకుంటున్న అనేక మంది రోగుల్లో హెచ్1ఎన్1 వైరస్ క‌నిపించింది. స్వైన్ ఫ్లూ, కరోనా లక్షణాలు ఒకేవిధంగా ఉంటాయి. ఈ రెండు వ్యాధులు శ్వాససంబంధితమైనవి. స్వైన్ ఫ్లూ రోగులకు కరోనా చికిత్స అందించ‌కూడ‌ద‌ని వైద్యులు చెబుతున్నారు.

Updated Date - 2021-06-22T11:21:06+05:30 IST