మహారాష్ట్ర మంత్రి బాలాసాహెబ్‌కు COVID positive

ABN , First Publish Date - 2021-12-31T12:37:56+05:30 IST

మహారాష్ట్ర మంత్రి బాలాసాహెబ్ థోరట్ కొవిడ్ బారిన పడ్డారు ...

మహారాష్ట్ర మంత్రి బాలాసాహెబ్‌కు COVID positive

ముంబై: మహారాష్ట్ర మంత్రి బాలాసాహెబ్ థోరట్ కొవిడ్ బారిన పడ్డారు. తాను కరోనా బారిన పడ్డానని కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి బాలాసాహెబ్ ట్వీట్ చేశారు. ‘‘నేను చేయించుకున్న పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. కరోనా లక్షణాలు లేకున్నా డాక్టర్ సలహాపై చికిత్స పొందుతున్నాను. నన్ను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను. మాస్కులు ధరించి కొవిడ్ మార్గదర్శకాలు పాటించండి’’ అని మంత్రి బాలాసాహెబ్ ట్వీట్ చేశారు. మహారాష్ట్రలో ఒక్కరోజే 198 ఒమైక్రాన్ వేరియెంట్ కేసులు నమోదయ్యాయి.వీరిలో 30 మంది అంతర్జాతీయ ప్రయాణికులున్నారు. మహారాష్ట్రలో మొత్తం ఒమైక్రాన్ కేసుల సంఖ్య 450కి పెరిగింది. మహారాష్ట్రలో ఒక్కరోజే 5,368 మందికి కరోనా సోకింది. దీంతో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 18,217కు చేరింది.  


Updated Date - 2021-12-31T12:37:56+05:30 IST