మహా మంత్రి నవాబ్ మాలిక్‌కు threat calls..వై ప్లస్ కేటగిరి సెక్యూరిటీ

ABN , First Publish Date - 2021-10-14T17:08:47+05:30 IST

మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌కు వివిధ రాష్ట్రాల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ రావడంతో అతనికి సెక్యూరిటీ పెంచారు...

మహా మంత్రి నవాబ్ మాలిక్‌కు threat calls..వై ప్లస్ కేటగిరి సెక్యూరిటీ

ముంబై : మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌కు వివిధ రాష్ట్రాల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ రావడంతో అతనికి సెక్యూరిటీ పెంచారు. మంత్రి నవాబ్ మాలిక్ గత వారం విలేకరుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో మంత్రి నవాబ్ మాలిక్ ను బెదిరిస్తూ పలు ఫోన్లు వచ్చాయి. దీంతో మంత్రి నవాబ్ కు వై ప్లస్ కేటగిరి సెక్యూరిటీని కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.అంతకుముందు మంత్రికి పిస్టల్‌తో పోలీసు గార్డుతో భద్రత కల్పించారు.బెదిరింపు కాల్స్ అనంతరం వై ప్లస్ కేటగిరి సెక్యూరిటీ కల్పించారు. మంత్రి నివాసంలో నలుగురు సాయుధ పోలీసు గార్డులు, పైలట్ కారు, నలుగురు సాయుధ పోలీసు గార్డులతో భద్రతను మెరుగుపర్చారు.

Updated Date - 2021-10-14T17:08:47+05:30 IST