రైతులకు మధ్య ప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త!

ABN , First Publish Date - 2021-10-20T01:36:10+05:30 IST

మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైతులు,

రైతులకు మధ్య ప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త!

భోపాల్ : మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైతులు, గృహ విద్యుత్తు వినియోగదారులకు రాయితీలను ప్రకటించింది. రైతులకు విద్యుత్తు బిల్లులపై రూ.15,700 కోట్లు రాయితీ ఇచ్చేందుకు, గృహ విద్యుత్తు వినియోగదారులకు రూ.4,980 కోట్లు రాయితీని కొనసాగించేందుకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన వర్చువల్ విధానంలో మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. 


కేబినెట్ సమావేశం అనంతరం ప్రభుత్వ అధికార ప్రతినిధి నరోత్తమ్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ, రైతులకు విద్యుత్తు బిల్లులపై రూ.15,700 కోట్లు రాయితీ ఇచ్చేందుకు, గృహ విద్యుత్తు వినియోగదారులకు రూ.4,980 కోట్లు రాయితీని కొనసాగించేందుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీలు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి గృహ విద్యుత్తు బిల్లులపై గృహ జ్యోతి యోజన పథకం క్రింద కల్పిస్తున్న రాయితీల వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ.4,981.69 కోట్లు భారం పడుతుందన్నారు. 10 హెచ్‌పీ వరకు సామర్థ్యంగల వ్యవసాయ పంపుల విద్యుత్తు బిల్లులపై రూ.15,722.87 కోట్లు రాయితీ ఇస్తామన్నారు. విద్యుత్తు రాయితీల వల్ల 21.75 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందుతారని చెప్పారు.  16 జిల్లాల్లోని గిరిజనులకు ఇంటి వద్దకే రేషన్ సరుకుల సరఫరా పథకాన్ని ఆమోదించినట్లు చెప్పారు. 


Updated Date - 2021-10-20T01:36:10+05:30 IST