డీఎన్‌ఏ వ్యాక్సిన్‌తో దీర్ఘకాలిక రక్షణ

ABN , First Publish Date - 2021-05-30T09:47:52+05:30 IST

తైవాన్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధిచేసిన డీఎన్‌ఏ ఆధారిత కరోనా వ్యాక్సిన్‌తో ఎలుకలపై నిర్వహిస్తున్న ప్రయోగ పరీక్షల్లో సానుకూల ఫలితాలు వచ్చాయి. టీకా రెండు డోసులిచ్చిన ఎలుకల్లో బలమైన

డీఎన్‌ఏ వ్యాక్సిన్‌తో దీర్ఘకాలిక రక్షణ

న్యూఢిల్లీ, మే 29: తైవాన్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధిచేసిన డీఎన్‌ఏ ఆధారిత కరోనా వ్యాక్సిన్‌తో ఎలుకలపై నిర్వహిస్తున్న ప్రయోగ పరీక్షల్లో సానుకూల ఫలితాలు వచ్చాయి. టీకా రెండు డోసులిచ్చిన ఎలుకల్లో బలమైన రోగ నిరోధక ప్రతిస్పందనను గుర్తించామని, కరోనా వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌ను తిప్పికొట్టే యాంటీబాడీలు భారీ సంఖ్యలో విడుదలైనట్లు పరిశోధకులు వెల్లడించారు. వ్యాక్సిన్‌ ఇచ్చిన 8 వారాల తర్వాత యాంటీబాడీల సంఖ్య పతాక స్థాయికి చేరిందని, 20 వారాల తర్వాత కూడా వాటి మోతాదు తగ్గలేదని తెలిపారు. 

Updated Date - 2021-05-30T09:47:52+05:30 IST