కేజ్రీవాల్ ప్రభుత్వ అధికారాలకు కేంద్రం కత్తెర.. ఎన్‌సీటీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ABN , First Publish Date - 2021-03-23T02:49:20+05:30 IST

కేజ్రీవాల్ ప్రభుత్వానికి అధికారాల్లో కోత విధించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల

కేజ్రీవాల్ ప్రభుత్వ అధికారాలకు కేంద్రం కత్తెర.. ఎన్‌సీటీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

న్యూఢిల్లీ: కేజ్రీవాల్ ప్రభుత్వ అధికారాల్లో కోత విధించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల తీవ్ర నిరసన మధ్య సోమవారం నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (ఎన్‌సీటీ) సవరణ బిల్లు 2021ను లోక్‌సభ ఆమోదించింది. ఈ బిల్లు వల్ల ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు మరిన్ని అధికారాలు సంక్రమిస్తాయి. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారాలకు గండిపడుతుంది. ఈ బిల్లు ప్రకారం ఇకపై ఢిల్లీలో ప్రభుత్వమంటే లెఫ్టినెంట్ గవర్నరే. బిల్లు చట్టంగా మారితే ఇకపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఎలాంటి కార్యనిర్వాహక చర్యలకైనా ముందు లెఫ్టినెట్ గవర్నర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. 


ఎన్‌సీటీ బిల్లును కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించాయి. ఈ బిల్లును ఆమోదించి ఢిల్లీ ప్రజలను అవమానించారని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మండిపడ్డారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం నుంచి ఈ బిల్లు అధికారాలను లాగేసుకుని, ఓడిన వ్యక్తులకు ఇస్తుందని ధ్వజమెత్తారు. ప్రజలను బీజేపీ మోసం చేసిందని కేజ్రీవాల్ విరుచుకుపడుతూ ట్వీట్ చేశారు.

Updated Date - 2021-03-23T02:49:20+05:30 IST