కొత్త సడలింపులతో లాక్‌డౌన్
ABN , First Publish Date - 2021-02-01T12:46:07+05:30 IST
రాష్ట్రంలో మరిన్ని సడలింపులతో ఫిబ్రవరి నెలాఖరు వరకు కరోనా లాక్ డౌన్ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎడప్పాడి...

8 నుంచి కళాశాలల ప్రారంభం
థియేటర్లలో వందశాతం ప్రేక్షకులకు అనుమతి
సీఎం ఎడప్పాడి వెల్లడి
చెన్నై(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరిన్ని సడలింపులతో ఫిబ్రవరి నెలాఖరు వరకు కరోనా లాక్ డౌన్ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. లాక్‌డౌన్ కొనసాగించే విషయమై రెండు రోజుల క్రితం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, వైద్యనిపుణుల కమిటీ సభ్యులతో సమగ్రంగా చర్చలు జరిపానని, ఆ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం కొత్త సడలింపులతో లాక్‌డౌన్ కొనసాగించనున్నట్టు ఎడ ప్పాడి ఆ ప్రకటనలో తెలిపారు. కరోనా వ్యాప్తి ఉన్న కంటైన్ మెంట్ జోన్ల మినహా తక్కిన అన్ని ప్రాంతాల్లో కొత్త సడలింపులతో లాక్‌డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
కొత్త సడలింపులివే..
ఫ రాష్ట్రవ్యాప్తంగా కరోనా నిరోధక నిబంధనలతో ఆర్ట్స్, సైన్స్, టెక్నికల్, ఇంజ నీరింగ్, మేనేజ్‌మెంట్, ఫిషరీస్, వెటర్నరీ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులకు సంబంధించిన అన్ని తరగతులు ఫిబ్ర వరి 8 నుంచి ప్రారంభమవుతాయి. ఆయా కళశాలలు, విశ్వవిద్యాలయాలకు సంబంధించిన హాస్టళ్లు కూడా ప్రారంభమవుతాయి.
రాష్ట్రమంతటా 9, 11 తరగతుల పాఠశాలల్ని కూడా ఫిబ్రవరి ఎనిమిది నుంచి ప్రారంభించ నున్నారు. ఈ పాఠశాలలు చదివే విద్యార్థులకు వసతి గృహాలు పునఃప్రారంభమవుతాయి.
ప్రస్తుతం రాత్రి పది గంటల వరకు మాత్రమే ఉండే పెట్రోల్ బంకులన్నీ ఫిబ్రవరి ఒకటి నుంచి నిర్విరామంగా పనిచేస్తాయి.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని మల్టీప్లెక్స్‌ల సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్ల లో ఫిబ్రవరి ఒకటి నుంచి వందశాతం ప్రేక్షకులను అనుమతిస్తారు.
కరోనా నిబంధనలతో ఎగ్జిబిషన్‌హాళ్లుపునఃప్రారంభం
ఫిబ్రవరి ఒకటి నుంచి 50 శాతం సీటింగ్ కెపా సిటీతో లేదా గరిష్టంగా 600ల మందితో రాజకీయ, సామాజిక, వినోద, క్రీడా, సాంస్కృతిక సమావేశాలకు అనుమతి
క్రీడాపోటీలకు మైదానాలు, స్టేడియంలలో 50 శాతం మంది ప్రేక్షకులకు అనుమతి
అన్ని జిల్లాల్లో ప్రజా విజ్ఞప్తుల దినం తదితర ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు అనుమతి.
రామేశ్వరం తీర్థకొలనులలో పుణ్యస్నానమాచరించడానికి అనుమతి.
నిషేధాజ్ఞలు...
చెన్నైలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై ప్రస్తుతం అమలులో ఉన్న నిషేధం కొన సాగుతుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతించిన మార్గాలలో మాత్రమే విమాన సర్వీసులు కొనసాగుతాయి. తక్కిన మార్గాలకు ప్రత్యేకించి విదేశీ నగరాలకు విమాన సర్వీసులను నడిపే అవకాశం లేదు.
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న కంటైన్‌మెంట్ జోన్లలో తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంతవరకూ ప్రస్తుతమున్న నిబంధనలతో లాక్‌డౌన్ కొనసాగుతుంది.