మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2021-03-24T21:49:30+05:30 IST

మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతుండడంతో మార్చి 26 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు బీద్ జిల్లాలో సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించింది. ఫంక్షన్ హాళ్లు, హోటల్స్, రెస్టారెంట్స్ మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతుండడంతో మార్చి 26 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు బీద్ జిల్లాలో సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించింది. ఫంక్షన్ హాళ్లు, హోటల్స్, రెస్టారెంట్స్ మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. వీటితో పాటు స్కూళ్లు, కాలేజీలు కూడా తెరిచే అవకాశం లేదని స్పష్టం చేసింది. అయితే నిత్యవసరాల సరుకులు, మెడికల్ షాపులకు ఈ లాక్‌డౌన్ నుంచి మినహాయింపు లభించింది. 


గత సంవత్సరం నవంబర్ నుంచి కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ వారం రోజుల నుంచి కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందు జాగ్రత్తగా విద్యాసంస్థలు మూసివేయాలని నిర్ణయించాయి. అయితే దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో ఎక్కువగా మహారాష్ట్ర నుంచే ఉండడం గమనార్హం.


Updated Date - 2021-03-24T21:49:30+05:30 IST