తమిళనాడులో పూర్తిస్థాయి లాక్‎డౌన్

ABN , First Publish Date - 2021-05-08T14:39:47+05:30 IST

కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం చేస్తుండటంతో తమిళనాడు ప్రభుత్వం 14 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ...

తమిళనాడులో పూర్తిస్థాయి లాక్‎డౌన్

చెన్నై : కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం చేస్తుండటంతో తమిళనాడు ప్రభుత్వం 14 రోజుల పాటు పూర్తిస్థాయి లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూ , వీకెండ్ లాక్‎డౌన్ పెడుతున్నాయి. కానీ వీటితో ఫలితం లేదనుకున్న రాష్ట్రాలు మళ్లీ పూర్తిగా లాక్‎డౌన్ పెట్టాలని నిర్ణయించుకున్నాయి. తాజాగా ఇదే జాబితాలో తమిళనాడు కూడా చేరింది. ఈ నెల 10 నుంచి 24 వరకు పూర్తిస్థాయి లాక్‎డౌన్ విధిస్తున్నట్లు తమిళ సర్కార్ అధికార ప్రకటన చేసింది. మరోవైపు కర్ణాటకలో 10 నుంచి 24వ తేదీ వరకు లాక్‎డౌన్ విధించగా.. ఇక కేరళ ప్రభుత్వం నేటి నుంచి ఈ నెల 16 వరకు లాక్‎డౌన్‎ను ప్రకటించింది.

Updated Date - 2021-05-08T14:39:47+05:30 IST