కేరళలో లాక్‌డౌన్ పొడిగింపు
ABN , First Publish Date - 2021-05-22T00:33:18+05:30 IST
లాక్‌డౌన్‌ను ఈ నెల 30 వరకూ పొడిగిస్తూ ముఖ్యమంత్రి పినరయ్ ఆదేశాలు జారీ చేశారు. అయితే త్రిపుల్

తిరువనంతపురం : లాక్‌డౌన్‌ను ఈ నెల 30 వరకూ పొడిగిస్తూ ముఖ్యమంత్రి పినరయ్ ఆదేశాలు జారీ చేశారు. అయితే త్రిపుల్ లాక్‌డౌన్ విధించిన నాలుగు జిల్లాల నుంచి మూడు జిల్లాలను మినహాయించారు. తిరువనంతపురం, ఎర్నాకులం, త్రిశూర్ జిల్లాలను ఈ త్రిపుల్ లాక్‌డౌన్ నుంచి మినహాయించారు. అయితే మలప్పురంలో మాత్రం త్రిపుల్ లాక్‌డౌన్ అమలులో ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నాలుగు జిల్లాల్లో కేరళ సర్కార్ త్రిపుల్ లాక్‌డౌన్ విధించింది. మే 16 నుంచి 23 మే వరకూ ఈ నిబంధన అమలులో ఉంటుంది. కాగా 24 గంటల్లో 29,673 కేసులు నమోదయ్యాయని, 41,032 మంది కరోనా నుంచి కోలుకున్నారని, 142 మంది ప్రాణాలను కోల్పోయారని సీఎం తెలిపారు.