ఉల్లావూర్‌లో పోలింగ్‌ నిలిపివేత

ABN , First Publish Date - 2021-10-07T14:35:03+05:30 IST

కాంచీపురం జిల్లా వాలాజా బాద్‌ యూనియన్‌ పరిధి లోని ఉల్లాపూర్‌ పంచాయతీలో పోలింగ్‌ నిలిపివేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ జిల్లాలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ చేపట్టిన తొలివిడ

ఉల్లావూర్‌లో పోలింగ్‌ నిలిపివేత

ప్యారీస్‌(చెన్నై): కాంచీపురం జిల్లా వాలాజా బాద్‌ యూనియన్‌ పరిధి లోని ఉల్లాపూర్‌ పంచాయతీలో పోలింగ్‌ నిలిపివేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ జిల్లాలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ చేపట్టిన తొలివిడత స్థానిక ఎన్నికల్లో కాంచీపురం, వాలాజాబాద్‌, ఉత్తరమేరూర్‌ యూనియన్‌ పంచాయతీల్లో బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. ప్రజలు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ క్రమంలో, ఉల్లాపూర్‌ పంచాయతీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న లక్ష్మి పేరు, బ్యాలెట్‌ పేపరులో ఆమె పేరు ధనలక్ష్మిగా ముద్రించారు. తన పేరు తప్పుగా ముద్రించిన కారణంగా తాను విజయావకాశాలు కోల్పోయే అవకాశముందని భావించిన లక్ష్మి ఆమె తరఫున బూత్‌ ఏజెంట్లు దీనిపై ఎన్నికల అధికారి వద్ద వాగ్వాదానికి దిగారు. దీంతో తప్పుగా ముద్రించిన బ్యాలెట్‌ పేపర్‌లో ఉన్న ధనలక్ష్మి పేరులోని ధన అనే రెండు అక్షరాలు సిరా పూసి సవరించి ఓటర్లకు వినియోగిస్తామని పోలింగ్‌ అధికారి చెప్పినప్పటికీ అభ్యర్ధి తరఫున అభ్యంతరం తెలిపారు.


Updated Date - 2021-10-07T14:35:03+05:30 IST