దా‘రుణ’ యాప్‌ల కట్టడికి చట్టం

ABN , First Publish Date - 2021-01-13T07:35:33+05:30 IST

దా‘రుణ’ యాప్‌లను కట్టడి చేయడానికి చట్టం తేవాలని కేరళ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర

దా‘రుణ’ యాప్‌ల కట్టడికి చట్టం

పరిశీలిస్తున్న కేరళ ప్రభుత్వం


తిరువనంతపురం, జనవరి 12: దా‘రుణ’ యాప్‌లను కట్టడి చేయడానికి చట్టం తేవాలని కేరళ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఈపీ జయరాజన్‌ మంగళవారం అసెంబ్లీలో తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే రుణ యాప్‌లకు సంబంధించి 63 కేసులు నమోదయ్యాయని, ఆ యాప్‌ల నిర్వాహకుల అక్రమాలు తమ ప్రభుత్వం దృష్టికి వచ్చాయని చెప్పారు. ఆ యాప్‌ల మోసాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు.  


Updated Date - 2021-01-13T07:35:33+05:30 IST