ఢిల్లీకి మూడు రెట్లు ఉన్న భారీ ఐస్‌బర్గ్ బ్రేక్!

ABN , First Publish Date - 2021-05-21T00:54:46+05:30 IST

అంటార్కిటికాకు పశ్చిమ ప్రాంతంలో ఉన్న రోనీ ఐస్ షెల్ఫ్ నుంచి భారీ ఐస్‌బర్గ్ బ్రేక్ అయింది.

ఢిల్లీకి మూడు రెట్లు ఉన్న భారీ ఐస్‌బర్గ్ బ్రేక్!

అంటార్కిటికాకు పశ్చిమ ప్రాంతంలో ఉన్న రోనీ ఐస్ షెల్ఫ్ నుంచి భారీ ఐస్‌బర్గ్ బ్రేక్ అయింది. 170 కిలో మీటర్ల పొడవు, 25 కిలీమీటర్ల వెడల్పుతో ఉండే ఈ ఐస్‌బర్గ్ ఢిల్లీ వైశాల్యానికి దాదాపు మూడు రెట్లు పెద్దదిగా ఉంటుంది. చేతి వేలు ఆకారంలో ఉండే ఈ ఐస్‌బర్గ్ ప్రస్తుతం వెడల్ సీ నీటిపై స్వేచ్ఛగా తేలుతూ ప్రయాణిస్తోంది. 


1484 చదరపు మైళ్ల వైశాల్యం కలిగిన ఈ ఐస్‌బర్గ్ పేరు ఎ-76. ఇది ప్రపంచంలోనే అత్యంత భారీ ఐస్‌బర్గ్. వెడల్ సీలో ప్రవహిస్తున్న ఈ భారీ ఐస్‌బర్గ్‌ను శాటిలైట్ ద్వారా గుర్తించినట్టు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రకటించింది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఇటీవలి కాలంలో మంచు కొండలు భారీగా విరిగిపోతున్నాయని, భవిష్యత్తులో తలెత్తబోయే విపత్తులకు ఇవి ముందస్తు హెచ్చరికలని వాతావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 

Updated Date - 2021-05-21T00:54:46+05:30 IST