సినిమా సెట్టింగా... ఎన్నికల కార్యాలయమా!?
ABN , First Publish Date - 2021-03-04T18:26:16+05:30 IST
సినిమా సెట్టింగ్ తరహాలో కంటైనర్లలో పార్టీ కార్యాలయ గదులు ఏర్పాటు
- నటి ఖుష్బూ రూటే సపరేటు
చెన్నై/పెరంబూర్ : సినిమా సెట్టింగ్ తరహాలో కంటైనర్లలో పార్టీ కార్యాలయ గదులు ఏర్పాటు చేసుకున్న నటి ఖుష్బూ తన ప్రత్యేకత చాటుకుంటున్నారు. స్థానిక చేపాక్కం-ట్రిప్లికేన్ నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జిగా ఖుష్బూ నియమితులైన విషయం తెలిసిందే. ఆ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం చేపట్టారు. తాజాగా, ఎన్నికల కోసం ప్రత్యేక కార్యాలయాన్ని అన్నాసాలైలోని ఎల్ఐసీ కార్యాలయం సమీపంలో 9 గ్రౌండ్ల స్థలంలో ఏర్పాటు చేశారు. ఆ స్థలంలో నాలుగు కంటైనర్లు పెట్టించి, వాటిలో ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. ఏసీ వసతి, టాయిలెట్, సీట్ల వసతి ఉన్న ఈ కంటైనర్లలో ఒకటి ఖుష్బూకు, మరో మూడు నియోజకవర్గం నేతలకు కేటాయించారు. ఈ కంటైనర్ల ముందు భాగంలో బీజేపీ చిహ్నం ఏర్పాటైంది. అలాగే, ఆ ప్రాంగణంలో 100 మంది కూర్చొని సమావేశం నిర్వహించేలా సీట్లవసతి, మంచినీరు, ఫ్యాన్ సౌకర్యాలు కల్పించారు.