కుమారస్వామి కుట్రతోనే ఈడీ దాడులు

ABN , First Publish Date - 2021-08-10T16:41:42+05:30 IST

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాడులు జరిగేందుకు జేడీఎస్‌ నేత కు మారస్వామి కుట్రలే కారణమని, వారి కుటుంబం బాగుండాలని తాము రోడ్డునపడ్డా పర్వాలేదని చామరాజపేట ఎ మ్మెల్యే జమీర్‌అహ్మద్‌ ఖాన్‌

కుమారస్వామి కుట్రతోనే ఈడీ దాడులు

- రికార్డుల కోసం 10 రోజులు గడువిచ్చారు... 

-  నోటీసులు రాలేదు : జమీర్‌అహ్మద్‌

- కేసుల విచారణలకు న్యాయవాదిగా కపిల్‌ సిబల్‌


బెంగళూరు: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాడులు జరిగేందుకు జేడీఎస్‌ నేత కుమారస్వామి కుట్రలే కారణమని, వారి కుటుంబం బాగుండాలని తాము రోడ్డునపడ్డా పర్వాలేదని చామరాజపేట ఎమ్మెల్యే జమీర్‌అహ్మద్‌ ఖాన్‌ పేర్కొన్నారు. సోమవారం జమీర్‌అహ్మద్‌ఖాన్‌ బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు తన నివాసంతో పాటు వ్యాపార వ్యవహారాలకు సంబంధించి 15 చోట్ల దాడులు జరిపారన్నారు. 20 గంటల పాటు సోదాలు చేశారన్నారు. దాడులకు వచ్చిన అధికారులకు సంపూర్ణంగా సహకరించినట్లు తెలిపారు. భారీ లక్ష్యంతోనే దాడులు చేశారని కానీ వారికి నిరాశ కలిగిందన్నారు. ఆదాయానికిమించి ఆస్తులపై ఐటీ అధికారుల రావాలి కానీ మీరెందుకు వచ్చారని వారిని అడిగానన్నారు. అందుకు మీపై ఫిర్యాదులు ఉన్నాయని వారు తెలిపారన్నారు. తమ ఇంటి వివరాలు, ఖర్చులు, నిర్మాణాలపై ఆరాతీశారన్నారు. ఇంటి రికార్డులు బ్యాంకులో ఉన్నందున తర్వాత సమర్పిస్తానని అధికారులకు వివరించానని, అందుకు 10 రోజుల గడువు ఇచ్చారన్నారు. విలాసవంతమైన నివాసం కట్టుకోరాదా అంటూ మీడియాను ఎదురు ప్రశ్నించారు. ఎవరినీ మోసం చేయలేదన్నారు. తనపై కుమారస్వామి ఫిర్యాదు చేసి ఉంటారనే అనుమానం వస్తోందన్నారు. ఐఎంఏ అక్రమాలకు సంబంధించి 2019లోనే అధికారులకు సమగ్ర వివరాలు ఇచ్చానన్నారు. రాజకీయాలు చేయాలి కానీ ఇలా ఇంటిపైనా కుట్రలు సమంజసమేనా అన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారుల నుంచి ఎటువంటి నోటీసులు రాలేదన్నారు. కాగా ఈడీ దాడికి సంబంధించి కాంగ్రెస్‌ అగ్రనేత కపిల్‌ సిబాల్‌ను న్యాయవాదిగా నియమించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే కపిల్‌ సిబల్‌తో కేసుకు సంబంధించి జమీర్‌అహ్మద్‌ఖాన్‌ సమగ్రంగా వివరించినట్లు సమాచారం. కాగా జమీర్‌ అ హ్మద్‌ ఆరోపణలకు మాజీ సీఎం కుమారస్వామి స్పందించారు. జమీర్‌పై తానెందుకు ఫిర్యాదు చేస్తానన్నారు. నాలుగేళ్ల కిందటే అతడితో సంబంధాలు తెంచేసుకున్నట్లు వివరించారు.

Updated Date - 2021-08-10T16:41:42+05:30 IST