ఎన్నికలొచ్చిన ప్రతిసారి కాంగ్రెస్‌కు జొరమొస్తది

ABN , First Publish Date - 2021-12-09T18:59:36+05:30 IST

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్‌ పార్టీకి చలి, జ్వరం వస్తుందని జేడీఎస్‌ నేత కుమారస్వామి ఎద్దేవా చేశారు. బుధవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ అబద్ధాల స్లోగన్‌ల సృష్టికర్త, టర్మినేటర్‌ సిద్ధహస్తుడు,

ఎన్నికలొచ్చిన ప్రతిసారి కాంగ్రెస్‌కు జొరమొస్తది

                         - కుమారస్వామి ఎద్దేవా 


బెంగళూరు: ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్‌ పార్టీకి చలి, జ్వరం వస్తుందని జేడీఎస్‌ నేత కుమారస్వామి ఎద్దేవా చేశారు. బుధవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ అబద్ధాల స్లోగన్‌ల సృష్టికర్త, టర్మినేటర్‌ సిద్ధహస్తుడు, అన్నింటా నిపుణుడు జేడీఎస్‌ను కుటుంబపార్టీ అంటూ సిద్ద రామయ్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం వరుస ట్వీట్‌లతో విమర్శలు గుప్పించారు. జేడీఎస్‌ కుటుంబమైతే, ఆయన కుమారుడిని ఎందుకు ఎమ్మెల్యే చేశారని ప్రశ్నించారు. మండ్యలో సహకార మంత్రి సహాయకుడిని గెలిపించుకునేందుకు కుల ప్రస్తావన తీసుకొస్తున్నారన్నారు. ఓటుపంట కోసం సెక్యులర్‌ అసలు రూపం బయట పడిందని సిద్దరామయ్యను ఉద్దేశించి విమర్శించారు. ఓటు పార్టీ అధ్యక్షుడిది కాదని కుల బంధువుడికి అంటూ డీకే శివకుమార్‌ ప్రచారంపైనా మండిపడ్డారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ కాంగ్రెస్‌కు వచ్చే జ్వరానికి జేడీఎస్‌ను విమర్శించడమే మందు అన్నారు. గతంలో జేడీఎస్‌ను బీజేపీ బీ-టీమ్‌ అన్నారని, ఎవరు ఎవరిచెంత కలసి పనిచేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. 

Updated Date - 2021-12-09T18:59:36+05:30 IST