కేరళ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు మరో భారీ షాక్

ABN , First Publish Date - 2021-03-22T23:21:37+05:30 IST

కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ భారీ షాక్ తగిలింది. ఏఐసీసీ సభ్యురాలు, కేరళ ప్రదేశ్ కాంగ్రెస్

కేరళ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు మరో భారీ షాక్

తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ భారీ షాక్ తగిలింది. ఏఐసీసీ సభ్యురాలు, కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) ఉపాధ్యక్షురాలు కేసీ రోసకుట్టీ సోమవారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో సీపీఎం సారథ్యంలోని ఎల్‌డీఎఫ్‌తో కలిసి సాగాలని ఆమె నిర్ణయించినట్టు తెలుస్తోంది.


సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసకున్నట్టు రోసకుట్టి తెలిపారు. పార్టీలో సంస్థాగత కుమ్ములాటలతో తాను విసిగిపోయానని, ఈ కారణంగా పార్టీకి రాజీనామా చేశానని వివరించారు. ఆమె రాజీనామాతో కాంగ్రెస్ పార్టీతో 37 ఏళ్లపాటు ఉన్న అనుబంధానికి తెరపడింది.


పార్టీలో మహిళలకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న రోసుకుట్టి.. ఇటీవల జరిగిన బిందుకృష్న, లతిక సుభాష్ ఘటనలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొట్టాయం జిల్లాలోని ఇట్టుమనూర్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన లతిక సుభాష్‌కు పార్టీ టికెట్ నిరాకరించడంతో ఆమె గుండు కొట్టించుకుని నిరసన తెలిపారు. అలాగే, బిందుకృష్ణ మీడియా ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇటీవల వివిధ అంశాలపై పార్టీ తీసుకున్న నిర్ణయాలు తనను తీవ్ర అసంతృప్తికి గురిచేశాయన్నారు. 

Updated Date - 2021-03-22T23:21:37+05:30 IST