కోయంబేడులో తగ్గిన టమోటా ధర

ABN , First Publish Date - 2021-09-03T16:11:14+05:30 IST

కోయంబేడు మార్కెట్‌లో టమోటా ధర బాగా తగ్గిపోయింది. గత వారం కేజీ టమోటా రూ.20లకు విక్రయించగా, ప్రస్తుతం కేజీ రూ.6లకు విక్రయిస్తున్నారు. చిల్లర దుకాణాలలో కేజీ టమోటా ధర రూ

కోయంబేడులో తగ్గిన టమోటా ధర

                   - కేజీ రూ.6లకు విక్రయం


చెన్నై: కోయంబేడు మార్కెట్‌లో టమోటా ధర బాగా తగ్గిపోయింది. గత వారం కేజీ టమోటా రూ.20లకు విక్రయించగా, ప్రస్తుతం కేజీ రూ.6లకు విక్రయిస్తున్నారు. చిల్లర దుకాణాలలో కేజీ టమోటా ధర రూ.25లకు విక్రయించగా, ప్రస్తుతం రూ.12లకు విక్రయిస్తున్నారు. బుధవారం రాత్రి కోయంబేడు మార్కెట్‌లో 14 కేజీల టమోటాల పెట్టెను రూ.120లకు విక్రయించాలని వ్యాపారులు నిర్ణయించారు. అయితే  ఊహించని విధంగా ఆ ధరకు టమోటాలు అమ్ముడు కాకపోవడంతో గురువారం మధ్యాహ్నానికి మార్కెట్‌లో టమోటాల నిల్వలు అధికం కావటంతో అవి కుళ్ళిపోతాయని భావించి 14 కేజీల టమోటాల పెట్టె ధరను రూ.80లకు తగ్గించి విక్రయించారు. 


Updated Date - 2021-09-03T16:11:14+05:30 IST