‘రూపాంతరం చెందిన కరోనాతో తీవ్ర పరిణామాలు’
ABN , First Publish Date - 2021-05-05T18:02:38+05:30 IST
రూపాంతరం చెందిన కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని దీన్ని తీవ్రంగా పరిగణించి ప్రతి ఒక్కరూ కొవిడ్ నియమాలు పాటించాలని సముదాయ ఆరోగ్యకేంద్రం పాలనా వైద్యాధికారి డాక్టర్ శ్యామ్‌సుందర్

విజయపుర(కర్ణాటక): రూపాంతరం చెందిన కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని దీన్ని తీవ్రంగా పరిగణించి ప్రతి ఒక్కరూ కొవిడ్ నియమాలు పాటించాలని సముదాయ ఆరోగ్యకేంద్రం పాలనా వైద్యాధికారి డాక్టర్ శ్యామ్‌సుందర్ పేర్కొన్నారు. బెంగళూరు గ్రామీణ జిల్లా దేవనహళ్ళి తాలూకా విజయపుర పట్టణంలో సీఐ కార్యాల యంలో ప్రత్యేకంగా కొవిడ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైవేటు ఆసుపత్రి డాక్టర్ భైరేగౌడ మాట్లాడుతూ కొవిడ్ పరీక్షలు చేసిన నాలుగు రోజుల తర్వాత రిపోర్టు వస్తోందన్నారు. ఒకవేళ పాజిటివ్ ఉంటే సదరు వ్యక్తి ద్వారా మరింతమందికి వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో టెస్టింగ్‌ల ఫలితం ఒకరోజులోనే వచ్చేలా చూడాలన్నారు. సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా కర్ఫ్యూతో కూలీలు, నిరుపే దలు భోజనానికి సైతం ఇబ్బంది పడుతున్నారని ఇటువంటివారికి స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారులు, దాతలు సమకూర్చుతున్నారన్నారు. ఎస్సై నందీశ్, జేడీస్ పట్టణ అధ్యక్షుడు ఎస్ భాస్కర్, పురసభ మాజీ అధ్యక్షుడు సతీశ్‌కుమార్, సభ్యులు పాల్గొన్నారు.