కరోనాకు హెడ్‌కానిస్టేబుల్‌ బలి

ABN , First Publish Date - 2021-05-02T16:53:40+05:30 IST

పట్టణంలోని రాజీవ్‌నగర్‌ లే అవుట్‌ నివాసి కరోనాతో మృతి చెందారు. బాగేపల్లి పో లీస్‌ స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేసే శ్రీనివాస్‌ (48) శనివారం వేకువజామున కన్నుమూశారు.

కరోనాకు హెడ్‌కానిస్టేబుల్‌ బలి


చింతామణి(కర్ణాటక): పట్టణంలోని రాజీవ్‌నగర్‌ లే అవుట్‌ నివాసి కరోనాతో మృతి చెందారు. బాగేపల్లి పో లీస్‌ స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేసే శ్రీనివాస్‌ (48) శనివారం వేకువజామున కన్నుమూశారు. ఆయనకు భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. చింతామణి పట్టణ, గ్రామీణ, శిడ్లఘట్ట పోలీస్‌ స్టేషన్‌లలో విధులు నిర్వహించారు. ప్రస్తుతం బాగేపల్లి స్టేషన్‌లో విధులు నిర్వహించే ఆయన శుక్రవారం తీవ్ర శ్వాసకోశ సమస్యతో ఇబ్బంది పడ్డారు. వెంటనే చింతామణి ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కో సం బెంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. కోలారు జిల్లా బంగారపేట తాలూకా ఆలగానహళ్ళిలో కొవిడ్‌ నిబంధనలతో అంత్యక్రియలు నిర్వహించారు. బాగేపల్లి సీఐ రాజు, ఎస్సై ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-02T16:53:40+05:30 IST