ఊపిరితిత్తుల్లో విజిల్‌.. తొలగించిన వైద్యులు

ABN , First Publish Date - 2021-11-27T07:44:04+05:30 IST

ఆ బాలుడి వయసు 12 ఏళ్లు. 11 నెలల క్రితం.. చిప్స్‌ తినే క్రమంలో ఓ ప్లాస్టిక్‌ విజిల్‌ను మింగేశాడు. అది కాస్తా సరాసరి అతడి ఊపిరితిత్తుల్లోకి చేరిపోయింది....

ఊపిరితిత్తుల్లో విజిల్‌.. తొలగించిన వైద్యులు

కోల్‌కతా, నవంబరు 26: ఆ బాలుడి వయసు 12 ఏళ్లు. 11 నెలల క్రితం.. చిప్స్‌ తినే క్రమంలో ఓ ప్లాస్టిక్‌ విజిల్‌ను మింగేశాడు. అది కాస్తా సరాసరి అతడి ఊపిరితిత్తుల్లోకి చేరిపోయింది. ఆ తర్వాత మొదలయ్యాయి అసలైన కష్టాలు. అతడి శరీరంలోని విజిల్‌ పనిచేయడం మొదలెట్టింది. నోటి ద్వారా గాలి వదిలినా, గట్టిగా మాట్లాడినా.. విజిల్‌ సౌండ్‌ వినిపించడం మొదలైంది.


ఓ రోజు ఈత కొట్టేందుకు బావిలో దిగిన బాలుడు.. కాసేపు కూడా నీటిలో ఉండలేకపోయాడు. ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. దీంతో భయపడ్డ అతడు.. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. వాళ్లు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఊపిరితిత్తుల్లో ఉన్న విజిల్‌ను వైద్యులు బ్రోంకోస్కోపీ ద్వారా తొలగించారు. కోల్‌కతాలో ఈ ఘటన జరగ్గా.. అక్కడి ఎస్‌ఎ్‌సకేఎం ఆస్పత్రి వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. తమ దగ్గరకు వచ్చేనాటికే బాలుడి పరిస్థితి విషమంగా ఉందని, మరికొద్ది రోజులు ఆలస్యమై ఉంటే.. పరిస్థితి చేయిదాటిపోయేదని వైద్యులు చెప్పారు. 

Updated Date - 2021-11-27T07:44:04+05:30 IST