పర్యాటక అభివృద్ధికి పెద్దపీట
ABN , First Publish Date - 2021-10-29T08:29:15+05:30 IST
దక్షిణాది రాష్ట్రాల్లో పర్యాటక రంగ సమగ్రాభివృద్ధికి పెద్దపీట వేయనున్నట్లు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు.
స్వదేశ్ దర్శన్‌లో దక్షిణాదికి 1088 కోట్లు
దక్షిణాది రాష్ట్రాల పర్యాటక మంత్రుల సమావేశంలో కిషన్‌రెడ్డి
బెంగళూరు, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): దక్షిణాది రాష్ట్రాల్లో పర్యాటక రంగ సమగ్రాభివృద్ధికి పెద్దపీట వేయనున్నట్లు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. బెంగళూరులో గురువారం జరిగిన దక్షిణాది రాష్ట్రాల పర్యాటక శాఖల మంత్రుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. అంతకుముందు రాష్ట్రాల వారీగా పర్యాటక రంగ అభివృద్ధిని ఆయన సమీక్షించారు. ‘స్వదేశ్ దర్శన్’ పథకంలో భాగంగా దక్షిణాదికి రూ.1,088 కోట్లు ఖర్చుకాగల 15 ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేసిందన్నారు. ‘ప్రసాద్’ పథకంలో భాగంగా దక్షిణాదికి మరో 6 ప్రాజెక్ట్‌లు మంజూరయ్యాయని గుర్తు చేశారు. ఈ సదస్సులో పర్యాటక అభివృద్ధి మండలి (ఏపీటీడీసీ) చైర్మన్ వరప్రసాద్‌రెడ్డి, అధికారుల బృందం పాల్గొంది. ఈ సందర్భంగా ఏపీటీడీసీ ఎండీ సత్యనారాయణ ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘‘ఆంరఽధప్రదేశ్‌లో పర్యాటక అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో బీచ్‌లు, బుద్ధవనాల అభివృద్ధ్దికి ప్రణాళిక రూపొందిస్తున్నాం’’ అని తెలిపారు. మంత్రి అవంతి శ్రీనివాస్, కమిషనర్... కేబినెట్ సమావేశం కారణంగా హాజరుకాలేక పోయారని తెలిపారు.