నా తలను తన్నండి

ABN , First Publish Date - 2021-03-22T07:04:27+05:30 IST

‘‘దీదీ (మమతాబెనర్జీ).. మీరు నా తలపై కాలు పెట్టండి..! నా తలను తన్నండి.. నేను అభ్యంతరం చెప్పను. కానీ,

నా తలను తన్నండి

దీదీ.. నా తలపై మీ కాలు పెట్టండి

నాకు అభ్యంతరం లేదు

కానీ, ప్రజల కలలను తన్ననివ్వను

బెంగాల్‌ ప్రచార సభలో మోదీ


 బంకుర, గువాహటి, మార్చి 21: ‘‘దీదీ (మమతాబెనర్జీ).. మీరు నా తలపై కాలు పెట్టండి..! నా తలను తన్నండి.. నేను అభ్యంతరం చెప్పను. కానీ, బెంగాలీల కలలను తన్నకండి. బెంగాల్‌లో అభివృద్ధిని మీరు ఆపలేరు’’ అని ప్రధాని నరేంద్ర మోదీ వాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల సందర్భంగా బంకురలో ఆదివారం నిర్వహించిన ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల టీఎంసీ ప్రచురించిన ప్రచార పోస్టర్లలో.. ప్రధాని నరేంద్ర మోదీ తలపై మమతాబెనర్జీ కాలు పెట్టినట్లు కార్టూన్‌ వేశారు. దీనిపై ప్రధాని ఆ పార్టీకి చురకలు అంటించారు. బెంగాలీల కలలను తన్నే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని సున్నితంగా హెచ్చరించారు. ఇటీవల మమత ఈవీఎంల పనితీరుపై ఆందోళన వ్యక్తం చేయడంపైనా ప్రధాని స్పందించారు.


‘‘దీదీ తన ఓటమిని ముందే గ్రహించారేమో..! అందుకే ఆమె ఈవీఎంలను శంకిస్తున్నారు. పదేళ్ల క్రితం ఆమె అవే ఈవీఎంలతో అధికారంలోకి వచ్చిన విషయాన్ని మర్చిపోయినట్లున్నారు’’ అని వ్యాఖ్యానించారు. మమత పదేళ్లుగా ఉత్తుత్తి హామీలకే పరిమితమయ్యారని విమర్శించారు. తమది స్కీముల ప్రభుత్వమని, మమతది స్కాముల సర్కారు అంటూ మండిపడ్డారు. ‘‘ఆయుష్మాన్‌ భారత్‌, పీఎం-కిసాన్‌, నగదు బదిలీ వంటి కేంద్ర పథకాలను మమత ప్రభుత్వం అమలు చేయడం లేదు. ఎందుకంటే.. ఆయా పథకాల్లో ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుతుంది. టీఎంసీ నాయకులకు ఎలాంటి కమీషన్లు ఉండవు’’ అని వ్యాఖ్యానించారు.


Updated Date - 2021-03-22T07:04:27+05:30 IST