కేరళలో కోవిడ్ పంజా.. భారీగా కేసులు నమోదు

ABN , First Publish Date - 2021-05-06T02:02:56+05:30 IST

కేరళలో కోవిడ్ పంజా.. భారీగా కేసులు నమోదు

కేరళలో కోవిడ్ పంజా.. భారీగా కేసులు నమోదు

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రరూపం దాలుస్తోంది. రాష్ట్రంలో రోజువారీగా భారీ సంఖ్యలో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం రాష్ట్రంలో అత్యధికంగా కొత్తగా 41,953 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ముఖ్యమంత్రి విజయన్ తెలిపారు. కరోనా వల్ల ఈ రోజు 58 మంది మరణించినట్లు సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో 3,75,658 మంది కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నట్లు విజయన్ వెల్లడించారు. కోవిడ్ నుంచి ఈ రోజు 23,106 మంది కోలుకున్నారని, ఇప్పటి వరకు మొత్తం 13,62,363 మంది రోగులు కోలుకున్నారని సీఎం చెప్పారు. ఇప్పటివరకు 5,565 మరణాలు నమోదయ్యాయని సీఎం విజయన్ పేర్కొన్నారు.

Updated Date - 2021-05-06T02:02:56+05:30 IST