కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్
ABN , First Publish Date - 2021-12-30T07:36:39+05:30 IST
జమ్మూకశ్మీర్‌లో బుధవారం చోటుచేసుకున్న రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ముగ్గురు మిలిటెంట్లు హతమయ్యారు. ..

ముగ్గురు మిలిటెంట్ల హతం
శ్రీనగర్, డిసెంబరు 29: జమ్మూకశ్మీర్‌లో బుధవారం చోటుచేసుకున్న రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ముగ్గురు మిలిటెంట్లు హతమయ్యారు. ముష్కరుల సంచారంపై నిఘా వర్గాల సమాచారం మేర కు కుల్గాం, అనంతనాగ్ జిల్లాలను భద్రత బలగాలు జల్లెడ పట్టాయి. ఈ క్రమంలో కుల్గాంలోని మిర్హమా ప్రాంతం, అనంత్‌నాగ్‌లోని నౌగామ్ షహబాద్ ప్రాంతాల్లో ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి. ఉగ్రవాదులు ఏ సంస్థకు చెందిన వారన్నది ఇంకా తేలాల్సి ఉంది.