అయోధ్య మీదుగా బుల్లెట్ ట్రైన్... ఢిల్లీ- వారణాసి మధ్య 12 స్టేషన్లు!

ABN , First Publish Date - 2021-08-10T16:23:04+05:30 IST

రాబోయే సెప్టెంబరు నాటికి ఢిల్లీ- వారణాసి కారిడార్ ఫైనల్...

అయోధ్య మీదుగా బుల్లెట్ ట్రైన్... ఢిల్లీ- వారణాసి మధ్య 12 స్టేషన్లు!

న్యూఢిల్లీ: రాబోయే సెప్టెంబరు నాటికి ఢిల్లీ- వారణాసి కారిడార్ ఫైనల్ డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్టు సిద్ధం కానున్నదని దేశంలో బుల్లెట్ రైళ్లను నడపబోయే సంస్థ నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్) ఆశాభావం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని సారయ్ కాలే ఖా నుంచి ప్రారంభమై ప్రధాని మోదీ నియోజకవర్గమైన వారణాసి వరకూ సుమారు 865 కిలోమీటర్ల మార్గంలో నడిచే బుల్లెట్ ట్రైన్‌కు సంబంధించిన ఫైనల్ డీపీఆర్ రిపోర్టు వచ్చే సెప్టెంబరు నాటికి సిద్ధం కానుంది. ఢిల్లీ- వారణాసి కారిడార్‌లో మొత్తం 12 స్టేషన్లు ఉంటాయి. 


Updated Date - 2021-08-10T16:23:04+05:30 IST