కరుణ స్మారక మందిరం కోసం రూ.39 కోట్లు

ABN , First Publish Date - 2021-11-09T15:33:44+05:30 IST

రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎంకే కరుణానిధి స్మారక మందిర నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.39 కోట్లు కేటాయించింది. ఆ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రానికి ఎంతో

కరుణ స్మారక మందిరం కోసం రూ.39 కోట్లు

చెన్నై(Chennai): రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎంకే కరుణానిధి స్మారక మందిర నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.39 కోట్లు కేటాయించింది. ఆ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రానికి ఎంతో సేవ చేసిన కరుణానిధి కోసం మెరీనాతీరంలోని ఆయన సమాధి వద్ద స్మారక మందిరం నిర్మిస్తామని ముఖ్యమంత్రి స్టాలిన్‌ గత ఆగస్టు 24వ తేదీన అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు తమిళ అభివృద్ధి, సమాచారశాఖ కార్యదర్శి కాశిరాజన్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

Updated Date - 2021-11-09T15:33:44+05:30 IST