జికా వైరస్ ఆందోళన నడుమ కేరళకు కర్నాటక బస్సులు..

ABN , First Publish Date - 2021-07-12T23:41:59+05:30 IST

కేరళకు బస్సు సర్వీసులను పునఃప్రారంభిస్తూ కర్నాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేరళలో కరోనా..

జికా వైరస్ ఆందోళన నడుమ కేరళకు కర్నాటక బస్సులు..

బెంగళూరు: కేరళకు బస్సు సర్వీసులను పునఃప్రారంభిస్తూ కర్నాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేరళలో కరోనా కేసుల పెరుగుదలతో పాటు జికా వైరస్ కలకలం రేపుతున్నప్పటికీ.. కర్నాటక ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే కర్నాటక మార్గదర్శకాల ప్రకారం ప్రయాణికులు తప్పనిసరిగా 72 గంటలకు ముందు నెగిటివ్ ఆర్టీపీసీఆర్  టెస్ట్ రిపోర్టును లేదా ఒక్కసారైనా వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్‌ను తమ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. రోజువారీ పనుల నిమిత్తం రాష్ట్రం నుంచి కేరళకు వెళ్లివచ్చే విద్యార్ధులు, వ్యాపారులు సహా ఇతరులు ప్రతి 15 రోజులకు ఓసారి ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. ప్రస్తుతం బెంగళూరు, మైసూరు, పుత్తూరు సహా ఇతర ప్రాంతాల అవసరం మేరకు కర్నాటక ఆర్టీసీ బస్సులను నడుపుతోంది. 

Updated Date - 2021-07-12T23:41:59+05:30 IST