బొమ్మై చేతిలోనే ఆర్థికం, ఇతర మంత్రుల శాఖలివే...

ABN , First Publish Date - 2021-08-07T20:40:30+05:30 IST

ఈవారం ప్రారంభంలో తన మంత్రివర్గంలోకి తీసుకున్న 29 మంది మంత్రులకు కర్ణాటక..

బొమ్మై చేతిలోనే ఆర్థికం, ఇతర మంత్రుల శాఖలివే...

బెంగళూరు: ఈవారం ప్రారంభంలో తన మంత్రివర్గంలోకి తీసుకున్న 29 మంది మంత్రులకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శనివారంనాడు శాఖలు కేటాయించారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. శాఖల కేటాయింపుల ప్రకారం, ఆర్థిక, క్యాబినెట్ వ్యవహారాల శాఖలను ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకున్నారు. వీటికి తోడు డీపీఏఆర్ (పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్), ఇంటెలిజెన్స్ ఫ్రమ్ హోమ్, బెంగళూరు డవలప్‌మెంట్ తదితర కేటాయింపులు జరగని శాఖలు ఆయన వద్దే ఉంచుకున్నారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖలను కేఎస్ ఈశ్వరప్పకు కేటాయించారు. రెవెన్యూ శాఖ ఆర్.అశోఖకు అప్పగించారు. రవాణా, ఎస్‌టీ (షెడ్యూల్ తెగలు) సంక్షేమ శాఖలను కేఎస్ ఈశ్వరప్పకు కేటాయించారు. వి.సోమన్నకు గృహనిర్మాణ, మౌలిక వసతుల అభివృద్ధి శాఖ కేటాయించారు.


మరిన్ని శాఖల వివరాలు...

గోవింద్ ముక్తప్ప కరజోల్‌: మేజర్, మీడియం ఇరిగేషన్

కేఎస్ ఈశ్వరప్ప: గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్

ఆర్ అశోక : రెవెన్యూ 

బి.శ్రీరాములు: రవాణా, ఎస్‌టీ సంక్షేమం

వి.సోమన్న: గృహ నిర్మాణం,  మౌలిక వసతుల అభివృద్ధి

ఉమేష్ విశ్వనాథ్ కట్టి : అడవులు, ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు

అంగార ఎస్: మత్స్య, నౌకాశ్రయాలు, ఇన్‌లాండ్ ట్రాన్స్‌పోర్ట్

జేఎస్ మధు స్వామి: మైనర్ ఇరిగేషన్, లా, పార్లమెంటరీ ఎఫైర్స్ అండ్ లెజిస్లేషన్

ఆరగ జ్ఞానేంద్ర: హోం మంత్రిత్వ శాఖ (ఇంటెలిజెన్స్ మినహా)

డాక్టర్ అస్వత్థ నారాయణ్ సీఎన్: ఉన్నత విద్య, ఐటీక్&బీటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, నైపుణాభివృద్ధి

చంద్రకాంతగౌడ పాటిల్: ప్రజాపనుల శాఖ (పీడబ్ల్యూడీ)

ఆనంద్ సింగ్ : ఎకోలజీ, పర్యావరణం, పర్యాటకం

కోట శ్రీనివాస్ పూజారి: సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతుల సంక్షేమం

ప్రభు చౌహాన్: పశు సంవర్ధక శాఖ

మురుగేష్ రుద్రప్ప నిరాని: భారీ , మధ్యతరహా పరిశఅరమలు

అరబైల్ హెబ్బార్ శివరామ్: కార్మిక శాఖ

ఎస్‌టీ సోమశేఖర్: కో-ఆపరేషన్ శాఖ

బీసీ పాటిల్: వ్యవసాయ శాఖ

బీఏ బసవరాజ (బైరటి): అర్బన్ డవలప్‌మెంట్ 

డాక్టర్ కె.సుధాకర్ : ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య

కె.గోపాలయ్య: ఎక్సైజ్ ఫ్రమ్ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్

జె.శశికళ అన్నాసాహెబ్: ముజరయ్, హజ్, వక్ఫ్

ఎన్.నాగరాజు : మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, చిన్నతరహా పరిశ్రమలు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు

నారాయణ గౌడ: పట్టుపరిశ్రమ, యువత సాధికారత, క్రీడలు

బీవీ నగేష్ : ప్రాథమిక, సెకండరీ విద్య

వి.సునీల్ కుమార్: ఎనర్జీ శాఖ, కన్నడ, కల్చర్

ఎ.హలప్ప బసవప్ప: గనులు

శంకర్ బి పాటిల్ మునేనకొప్ప: హ్యాండ్ లూమ్, టెక్స్‌టైల్ శాఖ

మునిరత్న: హార్టికల్చర్, ప్లానింగ్, ప్రోగ్రాం మానిటరింగ్, స్టాటస్టిక్స్ డిపార్ట్‌మెంట్

Updated Date - 2021-08-07T20:40:30+05:30 IST