'పొరుగు' ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు: బొమ్మై

ABN , First Publish Date - 2021-08-10T23:55:46+05:30 IST

కోవిడ్ కేసులు పెరగకుండా కేరళ, మహారాష్ట్ర నుంచి బెంగళూరుకు వచ్చే ప్రయాణికుల..

'పొరుగు' ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు: బొమ్మై

బెంగళూరు: కోవిడ్ కేసులు పెరగకుండా కేరళ, మహారాష్ట్ర నుంచి బెంగళూరుకు వచ్చే ప్రయాణికుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చెప్పారు. మంగళవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కేరళ నుంచి రాష్ట్ర రాజధానికి వచ్చే రైలు ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు జరపాలని భారత రైల్వేస్‌ను తాము కోరినట్టు చెప్పారు. రెండు రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్న పలు జిల్లాల్లో కోవిడ్ కేసుల ప్రభావం కనిపిస్తోందని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రైల్వే ప్రయాణికులకు తప్పనిసరిగా కోవిడ్ పరీక్షలు జరపాలని రైల్వే అధికారులను రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కోరారని చెప్పారు. మూడో వేవ్‌తో పోరాడేందుకు ముందస్తు చర్యలు తీసుకుటున్నామని, కేసులు మరిన్నిపెరిగితే, మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. మొదటి, రెండు వేవ్‌లలో కేరళ, మహారాష్ట్ర నుంచి వచ్చిన వారి వల్లే కేసులు పెరిగాయని సీఎం పేర్కొన్నారు.

Updated Date - 2021-08-10T23:55:46+05:30 IST