కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిపై కేసు

ABN , First Publish Date - 2021-05-21T11:03:39+05:30 IST

కొవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించి స్నేహితులతో విందు చేసుకుంటున్న యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, అతని స్నేహితులపై....

కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిపై కేసు

దేవనాగిరి (కర్ణాటక): కొవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించి స్నేహితులతో విందు చేసుకుంటున్న యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, అతని స్నేహితులపై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు. యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నిఖిల్ కొండాజీ, అతని స్నేహితులు ఎమ్మెల్యే కుమారుడు మిృణాల్, లక్ష్మీ హెబ్బాల్ కర్, సుహాస్, అంచాల్, డాక్టర్ హితా, డాక్టర్ సిమ్రాన్, చంద్రప్పా, నానిప్పలతో కలిసి స్కౌట్ హాలులో విందు చేసుకుంటుండగా గ్రామస్థులు పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించి స్నేహితులతో విందు చేసుకుంటున్న యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నిఖిల్ కొండాజీతో పాటు అతన్ని స్నేహితులపై కర్ణాటక ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 2020 ఉల్లంఘన కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-05-21T11:03:39+05:30 IST