టీకాలు వేయించుకున్న 150మంది వైద్య విద్యార్థులకు coronavirus

ABN , First Publish Date - 2021-11-26T16:33:23+05:30 IST

రెండు డోసుల కొవిడ్ టీకాలు వేయించుకున్న 150 మంది వైద్యవిద్యార్థులకు కరోనా సోకింది...

టీకాలు వేయించుకున్న 150మంది వైద్య విద్యార్థులకు coronavirus

బెంగళూరు : రెండు డోసుల కొవిడ్ టీకాలు వేయించుకున్న 150 మంది వైద్యవిద్యార్థులకు కరోనా సోకింది. కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ్ లోని ఎస్‌డీఎం వైద్యకళాశాలలో 150 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది.ఇందులో రెండు డోసుల టీకాలు వేయించుకున్న వైద్యవిద్యార్థులకు కూడా కరోనా సోకింది. వైద్య విద్యార్థులకు కరోనా సోకడంతో రెండు కళాశాల హాస్టళ్లను మూసివేశారు. మెడికల్ కళాశాలలో తరగతులను రద్దు చేశారు. కరోనా సోకిన విద్యార్థులను హాస్టల్ లోనే ఉంచి చికిత్స చేస్తున్నామని ధార్వాడ్ డిప్యూటీ కమిషనర్ నితీష్ పాటిల్ చెప్పారు. 


కరోనా సోకిన వైద్య విద్యార్థులను క్వారంటైన్ లో ఉంచి చికిత్స చేస్తున్నామని కళాశాల అధికారులు చెప్పారు. ఇటీవల కళాశాలలో ఈవెంటు జరిగిందని, దీనివల్ల పలువురు విద్యార్థులు కరోనా బారిన పడ్డారని అనుమానిస్తున్నారు. బెంగళూరు నగరంలోని ఇంటర్నేషనల్ బోర్డింగ్ స్కూలులో 33 మంది విద్యార్థులతోపాటు ఓ ఉపాధ్యాయుడికి కరోనా సోకింది. 


Updated Date - 2021-11-26T16:33:23+05:30 IST