లబ్ధిదారుడి ఇంటికే నిత్యావసరాలు: cm

ABN , First Publish Date - 2021-10-17T17:06:38+05:30 IST

బీపీఎల్‌ కార్డు లబ్ధిదారులకు ఇంటికే నిత్యావసరాలు సమకూర్చే సరికొత్త పథకానికి త్వరలోనే శ్రీకారం చుడతామని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై వెల్లడించారు. దావణగెరెలో శనివారం జిల్లా అధికారుల ‘పల్లె నిద్ర’కు శ్రీకా

లబ్ధిదారుడి ఇంటికే నిత్యావసరాలు: cm

- నవంబరులో బెంగళూరులో శ్రీకారం

- జనవరిలో రాష్ట్రమంతటా విస్తరణ: సీఎం 


బెంగళూరు: బీపీఎల్‌ కార్డు లబ్ధిదారులకు ఇంటికే నిత్యావసరాలు సమకూర్చే సరికొత్త పథకానికి త్వరలోనే శ్రీకారం చుడతామని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై వెల్లడించారు. దావణగెరెలో శనివారం జిల్లా అధికారుల ‘పల్లె నిద్ర’కు శ్రీకారం చుట్టారు. న్యామతి తాలూకా సురహన్నెలో పల్లెనిద్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ ఇంటికే రేషన్‌ సమకూర్చే వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ప్రభుత్వం అంటే విధానసౌధలో ఉండదని ప్రజలకు సౌలభ్యాలు కల్పించడమే లక్ష్యమన్నారు. నవంబరు 1 నుంచి బెంగళూరులోని 28 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో జనసేవక కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. 2022 జనవరి 26 నుంచి రాష్ట్రమంతటా విస్తరింపచేస్తామన్నారు. చౌకదుకాణానికి వెళ్లి రేషన్‌ పొందాల్సిన అవసరం లేదన్నారు. బియ్యం, పప్పుతోపాటు రాయితీతో అందించే నిత్యావసరాలు ఇంటివద్దనే పొందవచ్చునన్నారు. 

Updated Date - 2021-10-17T17:06:38+05:30 IST