కర్ణాటక: దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం తొలగించే బిల్లు

ABN , First Publish Date - 2021-12-31T00:53:43+05:30 IST

బెంగళూరు: కర్ణాటక మరో కీలక బిల్లు తీసుకురానుంది. ఇటీవలే మత మార్పిళ్లకు వ్యతిరేకంగా బిల్లు తెచ్చిన ప్రభుత్వం తాజాగా మరో కీలక బిల్లు తెచ్చేందుకు యత్నాలు ముమ్మరం చేసింది.

కర్ణాటక: దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం తొలగించే బిల్లు

బెంగళూరు: కర్ణాటక మరో కీలక బిల్లు తీసుకురానుంది. ఇటీవలే మత మార్పిళ్లకు వ్యతిరేకంగా బిల్లు తెచ్చిన బొమ్మై ప్రభుత్వం తాజాగా మరో కీలక బిల్లు తెచ్చేందుకు యత్నాలు ముమ్మరం చేసింది. దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం తొలగించే బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వ ఆధీనం తొలగితే భక్తుల విరాళాలతో దేవాలయాలు స్వయం సమృద్ధి సాధిస్తాయని కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర చెప్పారు. మరోవైపు ప్రభుత్వ యత్నాన్ని తాము అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆర్ధికంగా బలంగా ఉన్న దేవాలయాలను సంఘ్ పరివార్‌కు అప్పగించాలనే కుట్రను హిందువులమైన తాము అడ్డుకుంటామని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ చెప్పారు. 

Updated Date - 2021-12-31T00:53:43+05:30 IST