కన్న తండ్రిని గెంటేసిన కసాయి కొడుకు
ABN , First Publish Date - 2021-07-08T21:44:04+05:30 IST
మానవత్వం మరిచి జన్మనిచ్చిన తండ్రిని కసాయి కొడుకు ఇంట్లోనుంచి బయటకు గెంటేసాడు.

కర్నాటక: ‘పిల్లల్ని కంటాం కానీ.. వారి తలరాతలు కనలేంకదా’ ఈ సామెత కర్నాటకలో జరిగిన ఓ హృదయ విదారక ఘటనకు సరిగ్గా సరిపోతుంది. మానవత్వం మరిచి జన్మనిచ్చిన తండ్రిని కసాయి కొడుకు ఇంట్లోనుంచి బయటకు గెంటేసాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేఎస్ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్న కుమార్ తన తండ్రి తిమ్మయ్య ఆస్తిపై కన్నేశాడు. తండ్రి పేరుమీద ఉన్న ఇల్లు, ఆస్తిని తనపేరుమీద మార్చాలని ప్రతిరోజు తండ్రితో వాదనకు దిగేవాడు. ఉన్న ఆస్తిని కొడుకుపేరుమీద రాస్తే తనకు ఆధారం ఉండదనుకున్నాడేమో.. ఆస్తిని బదిలి చేయడానికి నిరాకరించాడు. దీంతో కోపంతో ఊగిపోయిన కుమార్ తండ్రిని బయటకు గెంటేశాడు.