కమల్ హాసన్ ఓటమి

ABN , First Publish Date - 2021-05-03T04:30:29+05:30 IST

కమల్ హాసన్ ఓటమి

కమల్ హాసన్ ఓటమి

చెన్నై: మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు, సినీ నటుడు కమల్ హాసన్ ఓటమి పాలయ్యారు. దక్షిణ కోయంబత్తూరులో ఆయన పోటీ చేశారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి వానతి శ్రీనివాసన్ చేతిలో కమల్ హాసన్ ఓడిపోయారు. కౌంటింగ్ ప్రారంభమైనప్పుడు కొన్ని రౌండ్లలో ఆధిక్యంలో ఉన్న కమల్.. చివరి వరకు ఆ ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి గెలుపునకు కారణమయ్యాయి.. అయితే తమిళనాడులో డీఎంకే పార్టీ విజయం సాధించింది. అన్నాడీఎంకే గట్టి పోటీ ఇచ్చినా స్టాలిన్ హావా ముందు నిలబడలేకపోయింది. 

Updated Date - 2021-05-03T04:30:29+05:30 IST