ఓటమిపై కమల్‌ సమీక్ష

ABN , First Publish Date - 2021-05-05T14:54:33+05:30 IST

శాసనసభ ఎన్నికల్లో సినీ నటుడు కమల్‌ హాసన్‌ సారథ్యంలోని ‘మక్కల్‌ నీది మయ్యం’ పార్టీ రవ్వంత కూడా ప్రభావం చూపించలేకపోయింది. ఆ పార్టీ దాదాపు 150 స్థానాల్లో పోటీ

ఓటమిపై కమల్‌ సమీక్ష



అడయార్‌(చెన్నై): శాసనసభ ఎన్నికల్లో సినీ నటుడు కమల్‌ హాసన్‌ సారథ్యంలోని ‘మక్కల్‌ నీది మయ్యం’ పార్టీ రవ్వంత కూడా ప్రభావం చూపించలేకపోయింది. ఆ పార్టీ దాదాపు 150 స్థానాల్లో పోటీ చేసింది. కానీ, కమల్‌హాసన్‌ పోటీ చేసిన కోయంబత్తూరు దక్షిణం స్థానంలోనే విజయం చివరి నిమిషం వరకు దోబూచులాడింది. చివరకు కమల్‌హాసన్‌ ఓడిపోయారు. అదేవిధంగా ఆ పార్టీ పోటీ చేసిన మిగిలిన స్థానాల్లో కూడా ఎంఎన్‌ఎం అభ్యర్థులు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. ఈ నేపథ్యంలో కమల్‌హాసన్‌ చెన్నైలోని పార్టీ కార్యాలయంలో కీలక నేతలతో సమావేశమయ్యారు. ఇందులో ఎన్నికల ఓటమికి గల కారణాలను ఆరా తీశారు. అదేసమయంలో పార్టీ నేతలకు కూడా కమల్‌హాసన్‌ ధైర్యం చెప్పారు. ఓటమితో కుంగిపోవద్దని, నిరంతరం ప్రజల మధ్యవుంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. అంతేకాకుండా, ఎన్నికల ఓటమిపై మరోమారు రాష్ట్ర స్థాయిలో ఒక సమీక్ష నిర్వహించేలా ఇందులో నిర్ణయించినట్టు సమాచారం. 


స్టాలిన్ కు అభినందనలు తెలిపిన కమల్

ఎన్నికల్లో విజయభేరీ మోగించిన డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ను కమల్‌హాసన్‌ మంగళవారం సాయంత్రం స్వయంగా కలిసి అభినందనలు తెలిపారు. స్థానిక ఆళ్వార్‌పేటలోని స్టాలిన్‌ నివాసంలో ఈ సమావేశం జరిగింది. నిజానికి ఎన్నికల ఫలితాలు వెల్లడైన మరుక్షణమే స్టాలిన్‌ను అభినందిస్తూ కమల్‌ తన ట్విటర్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఇపుడు స్వయంగా కాబోయే ముఖ్యమంత్రి స్టాలిన్‌తో ప్రత్యేకంగా సమావేశం కావడం గమనార్హం. 

Updated Date - 2021-05-05T14:54:33+05:30 IST