US Vice President కమలాహారిస్‌కు కొవిడ్ నెగిటివ్
ABN , First Publish Date - 2021-12-23T13:47:22+05:30 IST
అమెరికా దేశ ఉపాధ్యక్షురాలి కార్యాలయ సిబ్బందికి కొవిడ్ సోకడం కలకలం రేపింది...
వాషింగ్టన్ : అమెరికా దేశ ఉపాధ్యక్షురాలి కార్యాలయ సిబ్బందికి కొవిడ్ సోకడం కలకలం రేపింది. దీంతో యూఎస్ ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌కు కూడా కరోనా పరీక్షలు చేశారు. కమలాహారిస్‌కు యాంటీజెన్, ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా రెండింటిలోనూ కొవిడ్ నెగిటివ్ అని వచ్చింది. అమెరికా ఉపాధ్యక్షురాలి కార్యాలయ సిబ్బంది అందరికీ కొవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో రెగ్యులర్ టెస్టింగ్‌లో భాగంగా కమలా హారిస్‌కు యాంటిజెన్, ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా రెండూ నెగెటివ్‌గా వచ్చాయని వైట్ హౌస్ తెలిపింది. కొవిడ్ సోకిన యూఎస్ ఉపాధ్యక్షురాలి కార్యాలయ ఉద్యోగులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.