జాతీయ పార్టీలతో కమల్‌ ఢీ

ABN , First Publish Date - 2021-03-14T07:59:56+05:30 IST

కోయంబత్తూరు సౌత్‌ నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన మక్కల్‌ నీదిమయ్యం(ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు కమల్‌హాసన్‌ రెండు జాతీయ పార్టీల నుంచి పోటీ ఎదుర్కోనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎంఎన్‌ఎంకు కోయంబత్తూరులో లక్షా

జాతీయ పార్టీలతో కమల్‌ ఢీ

కోయంబత్తూరు సౌత్‌ నుంచి పోటీ

ప్రధాన ప్రత్యర్థులుగా కాంగ్రెస్‌, బీజేపీ


చెన్నై-ఆంధ్రజ్యోతి: కోయంబత్తూరు సౌత్‌ నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన మక్కల్‌ నీదిమయ్యం(ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు కమల్‌హాసన్‌ రెండు జాతీయ పార్టీల నుంచి పోటీ ఎదుర్కోనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎంఎన్‌ఎంకు కోయంబత్తూరులో లక్షా 45వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఆ నియోజకవర్గంలోనే ఉన్న కోయంత్తూరు సౌత్‌ శాసనసభ నియోజకవర్గంలో 23,838 ఓట్లు ఆ పార్టీకి లభించాయి. ఈ కారణంతోనే కమల్‌హాసన్‌ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఈ నియోజకవర్గంలో విద్యావంతులైన యువకులు, వివిధ పరిశ్రమలలో పనిచేసే కార్మికులు, మైనారిటీలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు అధికంగా ఉండటంతో వీరి ఓట్లన్నీ తనకు సులువుగా లభిస్తాయన్న అంచనాలో ఆయన ఉన్నారు. అన్నాడీఎంకే అధిష్ఠానం తమ కూటమిలోని బీజేపీకి ఈ నియోజకవర్గాన్ని కేటాయించింది. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే తమ కూటమిలోని కాంగ్రె్‌సకు ఈ సీటును కేటాయించింది. అయితే ఈ రెండు పార్టీలు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. కమల్‌హాసన్‌ పోటీ చేస్తుండటంతో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని  బీజేపీ, కాంగ్రెస్‌ యోచిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో అన్నాడీఎంకే, డీఎంకే ఐదేసి సార్లు, కాంగ్రెస్‌ నాలుగు సార్లు గెలిచాయి.  

Updated Date - 2021-03-14T07:59:56+05:30 IST