గాంధీని దూషించిన కాళీచరణ్‌ అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-12-31T08:55:03+05:30 IST

మహాత్మాగాంధీని కించపరిచారన్న ఆరోపణలపై ఆధ్యాత్మికవేత్త, స్వామీజీ కాళీచరణ్‌ మహరాజ్‌ను ఛత్తీ్‌సగఢ్‌ పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు.

గాంధీని దూషించిన కాళీచరణ్‌ అరెస్ట్‌

రాయ్‌పూర్‌/నాగపూర్‌, డిసెంబరు 30: మహాత్మాగాంధీని కించపరిచారన్న ఆరోపణలపై ఆధ్యాత్మికవేత్త, స్వామీజీ కాళీచరణ్‌ మహరాజ్‌ను ఛత్తీ్‌సగఢ్‌ పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఖజురహో పట్టణానికి 25 కి.మీ దూరంలో ఉన్న బాగేశ్వర్‌ ధామ్‌ సమీపంలోని ఓ అద్దె గదిలో తెల్లవారుజాము 4 గంటలకు కాళీచరణ్‌ను పట్టుకున్నట్లు రాయ్‌పూర్‌ ఎస్పీ ప్రశాంత్‌ అగర్వాల్‌ తెలిపారు. ఆయన్ను మహారాష్ట్ర పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారని ఆ రాష్ట్ర హోం మంత్రి దిలీప్‌ వాల్సే పాటిల్‌ అన్నారు.

Updated Date - 2021-12-31T08:55:03+05:30 IST