జస్టిస్‌ నానావతి కన్నుమూత

ABN , First Publish Date - 2021-12-19T07:54:58+05:30 IST

సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ గిరీశ్‌ ఠాకోర్‌లాల్‌ నానావతి (86) కన్నుమూశారు. శనివారం గుజరాత్‌లో ఆయన గుండెపోటుతో...

జస్టిస్‌ నానావతి కన్నుమూత

న్యూఢిల్లీ, డిసెంబరు 18: సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ గిరీశ్‌ ఠాకోర్‌లాల్‌ నానావతి (86) కన్నుమూశారు. శనివారం గుజరాత్‌లో ఆయన గుండెపోటుతో మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. 1935లో జన్మించిన నానావతి 1958లో బాంబే హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ ప్రారంభించారు. 1979లో గుజరాత్‌ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1994లో ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత కర్ణాటక హైకోర్టు చీఫ్‌ జస్టి్‌సగా సేవలు అందించారు. 1995లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2000లో పదవీ విరమణ చేశారు. 2002లో గోద్రా అల్లర్ల కేసు విచారణకు అప్పటి గుజరాత్‌ సీఎం నరేంద్ర మోదీ.. జస్టిస్‌ నానావతి, జస్టిస్‌ అక్షయ్‌ మెహతాతో కూడిన కమిషన్‌ను నియమించారు. ఈ కేసు తుది నివేదికను 2014లో అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి ఆనందీబెన్‌ పటేల్‌కు వారు సమర్పించారు. 1984లో సిక్కులపై జరిగిన దాడుల కేసులోనూ ఎన్డీయే ప్రభుత్వం నానావతి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. 

Updated Date - 2021-12-19T07:54:58+05:30 IST