జూలై 18న తమిళనాడు అవతరణ దినోత్సవం

ABN , First Publish Date - 2021-10-31T08:09:01+05:30 IST

ఇకపై ఏటా జూలై 18న తమిళనాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు.

జూలై 18న తమిళనాడు అవతరణ దినోత్సవం

చెన్నై, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ఇకపై ఏటా జూలై 18న తమిళనాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు. ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. 1967లో మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై మద్రాసు ప్రెసిడెన్సీ పేరును ‘తమిళనాడు’గా మార్చిన జూలై 18వ తేదీని ‘తమిళనాడు అవతరణ’ దినంగా జరుపుకోవడమే సముచితంగా ఉంటుందని తమకు సూచనలు అందాయన్నారు. 

Updated Date - 2021-10-31T08:09:01+05:30 IST