28న హుబ్బళ్లికి జేపీ నడ్డా

ABN , First Publish Date - 2021-12-26T18:33:20+05:30 IST

నాయకత్వ మార్పు, కేబినెట్‌లో ప్రక్షాళన వంటి అంశాలు రాష్ట్ర రాజకీయాలలో హాట్‌ టాపిక్‌గా మారిన తరుణంలో బీజేపీ కార్యవర్గ భేటీ కీలకం కానుంది. ఈనెల 28 నుంచి రెండు రోజుల పాటు రాష్ట్ర బీజేపీ కార్యవర్గ

28న హుబ్బళ్లికి జేపీ నడ్డా

                        - రాష్ట్రకార్యవర్గ సమావేశం ఏర్పాటు


బెంగళూరు: నాయకత్వ మార్పు, కేబినెట్‌లో ప్రక్షాళన వంటి అంశాలు రాష్ట్ర రాజకీయాలలో హాట్‌ టాపిక్‌గా మారిన తరుణంలో బీజేపీ కార్యవర్గ భేటీ కీలకం కానుంది. ఈనెల 28 నుంచి రెండు రోజుల పాటు రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సమావేశం హుబ్బళ్లిలో జరగనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, ప్రహ్లాద్‌జోషి, రాజీవ్‌చంద్రశేఖర్‌, శోభాకరంద్లాజే, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ అరుణ్‌సింగ్‌ పాల్గొననున్నారు. హుబ్బళ్లిలో శనివారం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేశ్‌ తెంగినకాయి మీడియా తో మాట్లాడుతూ మూడు నెలలకోసారి కార్యవర్గ సమావేశం, నెలకోసారి పదాధికారుల సభ జరుగుతాయన్నారు. ఇందులో భాగంగానే హుబ్బళ్లిలో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపైనా చర్చలు ఉంటాయన్నారు. 568 మంది ఆహ్వానితులు పాల్గొంటారన్నారు. రెండు రోజులపాటు ప్రత్యేక సమావేశాలు కొనసాగనున్నాయి. 

Updated Date - 2021-12-26T18:33:20+05:30 IST