కలంపై కత్తి
ABN , First Publish Date - 2021-02-01T06:44:27+05:30 IST
ఎర్రకోట పరిణామాలపై సీనియర్ జర్నలిస్టుల మీద కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హరియాణల్లోని బీజేపీ ప్రభుత్వాలు రాజ్‌దీప్ సర్దేశాయి, మృణాల్ పాండే, జాఫర్ ఆఘా, పరేశ్

జర్నలిస్టులపై 4 రాష్ట్రాల్లో కేసులు
ఎర్రకోట పరిణామాలపై సీనియర్ జర్నలిస్టుల మీద కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హరియాణల్లోని బీజేపీ ప్రభుత్వాలు రాజ్‌దీప్ సర్దేశాయి, మృణాల్ పాండే, జాఫర్ ఆఘా, పరేశ్ నాథ్, అనంత్ నాథ్, వినోద్ జోస్‌లపై దేశద్రోహం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా- తాజాగా వీరిపై ఢిల్లీలోనూ కేసులు నమోద య్యాయి. మరొక సీనియర్ జర్నలిస్టు, ది వైర్ సంపాదకుడు సిద్ధార్థ వరదరాజన్‌పై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసింది. ఈయన చేసిన తప్పల్లా- రిపబ్లిక్ డే నాడు ట్రాక్టర్ ప్రమాదంలో చనిపోయిన నవ్రీత్‌సింగ్ చెప్పిన వివరాల ఆధారంగా ది వైర్‌లో రాసిన ఓ వ్యాసాన్ని తన ఖాతా ద్వారా షేర్ చేయడమే! అటు సింఘూ సరిహధ్దు వద్ద పోలీసులు ఇద్దరు పాత్రికేయులను నిర్బంధించారు. వీరు: ధర్మేందర్ సింగ్ (ఆన్‌లైన్ న్యూస్ మీడియా), మనదీప్ పునియా(ఫ్రీలాన్స్ జర్నలిస్టు). ధర్మేం దర్‌సింగ్‌ను 12 గంటలు నిర్బంధించి వదిలేసినా పునియాపై మాత్రం 4 సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.