తరుణ్ తేజ్‌పాల్‌కు ఎట్టకేలకు విముక్తి

ABN , First Publish Date - 2021-05-21T17:08:48+05:30 IST

లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో తెహల్కా మ్యాగజైన్ మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్‌ తరుణ్..

తరుణ్ తేజ్‌పాల్‌కు ఎట్టకేలకు విముక్తి

గోవా: లైంగిక వేధింపుల కేసులో తెహల్కా మ్యాగజైన్ మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్‌ తరుణ్ తేజ్‌పాల్‌కు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఆయనపై నమోదైన ఆరోపణల నుంచి విముక్తి కలిగిస్తూ నిర్దోషిగా గోవా కోర్టు ప్రకటించింది. 2013లో తన జూనియర్ ఉద్యోగిపై ఎలివేటర్‌లో అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలను ఆయన ఎదుర్కొన్నారు. ఈ కేసులో 2013 నవంబర్ 30న ఆయనను గోవా పోలీసులు అరెస్టు చేశారు. 2014లో ఆయనపై ఛార్జిషీటు దాఖలు చేశాయి. అనంతరం ఆ ఏడాది జూలై 1 నుంచి ఆయన బెయిలుపై ఉన్నారు. 2017లో గోవా ట్రయిల్ కోర్టు ఆయనపై లైంగిక వేధింపులు, అత్యారాం, బలవంతంగా నిర్బంధం వంటి ఆరోపణలు చేసింది. తనపై చేసిన ఆరోపణలను రద్దు చేయాలని తేజ్‌పాల్ సుప్రీంకోర్టుకు చేసిన విజ్ఞప్తి వల్ల కేసు కాస్త ఆలస్యమైంది. 2019లో ఆయన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చి, తిరిగి దిగువ కోర్టుకు పంపింది. ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

Updated Date - 2021-05-21T17:08:48+05:30 IST