జార్ఖండ్‌: విద్యార్థునుల పట్ల పోలీసుల అమానుషం

ABN , First Publish Date - 2021-08-10T18:10:09+05:30 IST

జార్ఖండ్‌ పోలీసులు రెచ్చిపోయారు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన వాళ్లే...

జార్ఖండ్‌: విద్యార్థునుల పట్ల పోలీసుల అమానుషం

జార్ఖండ్‌ పోలీసులు రెచ్చిపోయారు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన వాళ్లే... ఇలా వ్యవహరించడం వివాదస్పదమవుతోంది.  శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన విద్యార్థునుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. లాఠీలతో విరుచుకుపడ్డారు. ఈ ఘటన ధన్‌బాద్ కలెక్టరేట్ దగ్గర చోటుచేసుకుంది.


రాష్ట్ర మంత్రి బన్నా గుప్తా చాంబర్‌లోకి దూసుకెళ్లేందుకు విద్యార్థునులు ప్రయత్నించారు. అంతే.. పోలీసులు విచక్షణారహితంగా లాఠీలతో విద్యార్థునులను చితకబాదారు. పోలీసులు తీరుపై స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-08-10T18:10:09+05:30 IST