సినిమా షూటింగులో హాలివుడ్ నటికి గాయాలు

ABN , First Publish Date - 2021-02-06T15:43:36+05:30 IST

ఓ సినిమా చిత్రీకరణలో హాలివుడ్ ప్రముఖ సినీనటి జెన్నిఫర్ లారెన్స్ గాయపడ్డారు...

సినిమా షూటింగులో హాలివుడ్ నటికి గాయాలు

వాషింగ్టన్ (అమెరికా): ఓ సినిమా చిత్రీకరణలో హాలివుడ్ ప్రముఖ నటి జెన్నిఫర్ లారెన్స్ గాయపడ్డారు.బోస్టన్ నగర సమీపంలో ‘డోన్ట్ లుక్ అప్’ సినిమా చిత్రీకరణ సాగుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. సినిమా చిత్రీకరణలో భాగంగా స్టంట్ కోసం ఓ పేలుడు సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా గాజు పగిలి హాలివుడ్ సినీనటి జెన్నిఫర్ లారెన్స్ కంటి వద్ద గాయమైంది. ఈ ప్రమాద ఘటనతో ‘డోన్ట్ లుక్ అప్’ సినిమా చిత్రీకరణను నిలిపివేశారు.లియోనార్డో డికాప్రియోతో కలిసి జెన్నిఫర్ లారెన్స్ ‘డోన్ట్ లుక్ అప్’ సినిమాలో నటిస్తుండగా ఈ ఘటన జరిగింది.ఈ సినిమాలో లారెన్స్ ఖగోల శాస్త్రవేత్త పాత్ర పోషిస్తోంది. 

Updated Date - 2021-02-06T15:43:36+05:30 IST