‘స్థానిక’ విజయం పొందిన 17 నెలల తర్వాత..

ABN , First Publish Date - 2021-05-12T17:18:01+05:30 IST

కడలూరు యూనియన్‌ కుమలంకుళం పంచాయతీ ఎన్నికలు గత 2019 డిసెంబరులో జరిగాయి. ఓట్ల లెక్కింపు 2020 జనవరిలో జరుగగా పంచాయతీ...

‘స్థానిక’ విజయం పొందిన 17 నెలల తర్వాత..

పంచాయతీ అధ్యక్షురాలి పదవీప్రమాణం

చెన్నై/పెరంబూర్‌: కడలూరు యూనియన్‌ కుమలంకుళం పంచాయతీ ఎన్నికలు గత 2019 డిసెంబరులో జరిగాయి. ఓట్ల లెక్కింపు 2020 జనవరిలో జరుగగా పంచాయతీ అధ్యక్ష పదవికి పోటీచేసిన జయలక్ష్మికి 2,860 ఓట్లు, విజయలక్ష్మికి 1,179 ఓట్లు వచ్చాయి. కానీ, ఎన్నికల అధికారులు జయలక్ష్మికి బదులుగా విజయలక్ష్మి విజయం సాధించినట్టు ప్రకటించి, ధృవీకరణ పత్రం కూడా అందజేశారు. అధికారుల ప్రకటనను వ్యతిరేకిస్తూ జయలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌ను గత నెల 19వ తేదీ హైకోర్టు న్యాయమూర్తులు ఎంఎం సుందరేశ్‌, మంజులతో కూడిన ధర్మాసనం విచారించి, రెండు వారాల్లో జయలక్ష్మిచే పదవీప్రమాణం చేయించాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతలోనే శాసనసభ ఎన్నికల నోటికేషన్‌ వెలువడడంతో కోడ్‌ అమలుకు వచ్చిన పదవీప్రమాణం జరుగలేదు. ఈ నేపథ్యంలో, కుమలంకుళం పంచాయతీ అధ్యక్షురాలుగా జయలక్ష్మిచే సోమవారం ఎన్నికల అధికారులు పదవీప్రమాణం చేయించారు.

Updated Date - 2021-05-12T17:18:01+05:30 IST