పోలీసుల అత్యుత్సాహం.. కొవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్‌ను అందించిన వ్యక్తిపై కేసు!

ABN , First Publish Date - 2021-05-02T21:04:37+05:30 IST

సొంత డబ్బుతో కరోనా పేషెంట్ల కోసం ఉచితంగా ఆక్సిజన్‌ సిలిండర్‌లను ఏర్పాటు చేసిన వ్యక్తిపై.. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించాడంటూ పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుం

పోలీసుల అత్యుత్సాహం.. కొవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్‌ను అందించిన వ్యక్తిపై కేసు!

న్యూఢిల్లీ: సొంత డబ్బుతో కరోనా పేషెంట్ల కోసం ఉచితంగా ఆక్సిజన్‌ సిలిండర్‌లను ఏర్పాటు చేసిన వ్యక్తిపై.. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించాడంటూ పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. దీనిపట్ల వివమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. భారత్‌లో కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తోంది. ఈ క్రమంలో చాలా రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన కొరత ఏర్పడింది. ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్ డిస్ట్రిక్ట్ ఆసుపత్రి సైతం కొవిడ్ బాధితులతో నిండిపోయింది. ఆసుపత్రిలో బెడ్లు దొరకక, ఆక్సిజన్ అందక కొందరు కొవిడ్ బాధితులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వారి బాధను విక్కీ అగ్రహారి అనే యువకుడు అర్థం చేసుకున్నాడు.


సొంత డబ్బుతో ఆక్సిజన్ సిలిండర్లను కొనుగోలు చేసి.. బెడ్లు దొరకకపోవడంతో ఆసుపత్రి బయట పడిగాపులు కాస్తున్న దాదాపు 30 మంది కొవిడ్ పేషెంట్లకు గత నెల 29న  ప్రాణ వాయువు అందించాడు. అయితే ఈ ఘటనపై జాన్‌పూర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవిడ్ టెస్ట్‌తో సంబంధం లేకుండానే నిబంధనలనుకు విరుద్ధంగా.. ఎటువంటి జాగ్రత్తలూ తీసుకోకుండా పేషెంట్లకు ఆక్సిజన్‌ను అందించడాన్ని తప్పుబట్టారు. అంతేకాకుండా విక్కీ అగ్రహారిపై పోలీసుకుల ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్‌లోని పలు సెక్షన్‌ల కింద విక్కీ అగ్రహారిపై కేసు నమోదు చేశారు. కాగా.. ఈ వ్యవహారం అంతా సోషల్ మీడియా‌లో వైరల్ అయింది. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు పోలీసుల చర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2021-05-02T21:04:37+05:30 IST